ఆర్యవైశ్య సంఘం సామాజిక సేవ అభినందనీయం...
మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ ...
By Prajaswaram
On
జవహర్ నగర్, నవంబర్ 10,(ప్రజాస్వరం) :
బాలాజీ నగర్ ఆర్యవైశ్య సంఘం సామాజిక సేవ కార్యక్రమాలు అభినందనీయమని మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ అన్నారు. శనివారం అమావాస్య సందర్భంగా బాలాజీ నగర్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం సభ్యులు నిర్ణయించే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తాను: మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు ప్రతి నెల చేపట్టే అన్నదాన కార్యక్రమం తో పాటు ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిరంజీవి రవీందర్ గుప్తా, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్ గుప్తా, మాజీ కార్పొరేటర్ శారద మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గజ్వేల్ శంకర్, రాజు యాదవ్, డిఎస్ఎస్ వెంకటేష్, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
10 Oct 2026 19:35:27
జాతీయ రహదారి దిగ్బంధం: వంటేరు ప్రతాప్ రెడ్డి వార్నింగ్... తూప్రాన్, అక్టోబర్ 05 (ప్రజాస్వరం) : ప్రతినిధి రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా


