కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజమ్ చిత్రపటం దహనం...

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజమ్ చిత్రపటం దహనం...

ఎంపీ పదవి నుంచి తొలగించాలి... బీజేపీ మహిళా మోర్చా డిమాండ్‌

మెదక్, అక్టోబర్ 12 (ప్రజాస్వరం) :

జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్‌, కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజమ్‌ పై విద్యార్థినుల లైంగిక వేధింపుల ఆరోపణలను నిరసిస్తూ మెదక్ పట్టణం శివాజీ చౌక్‌ లో సోమవారం మోర్చా జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లికా అశోక్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్‌, కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజమ్‌ చిత్రపటాన్ని దహనం చేశారు. అనంతరం మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ మహిళల భద్రత పై మాట్లాడే కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ ఎంపీ పై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని కోరారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని, కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, కౌన్సిలర్ పబ్బా రాజమణి లక్ష్మణ్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శైలజ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లావణ్య, కార్యదర్శి సౌజన్య, నాయకులు మౌనిక, రాణి తదితరులు పాల్గొన్నారు.

Latest News

కబడ్డీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన మాజీ సర్పంచ్ రాజిరెడ్డి.... కబడ్డీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన మాజీ సర్పంచ్ రాజిరెడ్డి....
చిన్న శంకరంపేట,అక్టోబర్ 12 (ప్రజాస్వరం): చిన్న శంకరంపేట మండల కేంద్రంలో కబడ్డీ ప్రీమియర్ లీగ్ (కె.పి.ఎల్) సీజన్-1 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కుమార్, ప్రవీణ్, పప్పు ఆధ్వర్యంలో...
ప్రజావాణిలో రెండు దరఖాస్తుల స్వీకరణ.. ఎంపీడీవో దామోదర్...
రైతుల పొట్ట కొడుతున్న రేవంత్ ప్రభుత్వం...
కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజమ్ చిత్రపటం దహనం...
మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు..
మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు...
రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలి....