ప్రజావాణిలో రెండు దరఖాస్తుల స్వీకరణ.. ఎంపీడీవో దామోదర్...

ప్రజావాణిలో రెండు దరఖాస్తుల స్వీకరణ.. ఎంపీడీవో దామోదర్...

చిన్న శంకరంపేట,అక్టోబర్ 12 (ప్రజాస్వరం) :

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రం వరకు వెళ్లకుండా, మండల కేంద్రంలోనే ఏర్పాటు చేసిన ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని చిన్న శంకరంపేట ఎంపీడీవో దామోదర్ తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఈరోజు కార్యక్రమానికి రెండు దరఖాస్తులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.భూ సమస్యలు, పింఛన్లు వంటి వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు నేరుగా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదని, మండలంలోనే దరఖాస్తు చేసుకుంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం కోసం జిల్లా కార్యాలయాలకు పంపుతామని ఎంపీడీవో భరోసా ఇచ్చారు. అదేవిధంగా, ఈ ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి హాజరుకాని అధికారుల వివరాలను సేకరిస్తున్నామని, వారంలోగా వారి పూర్తి వివరాలను గౌరవ కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుందని ఎంపీడీవో దామోదర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Latest News

కబడ్డీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన మాజీ సర్పంచ్ రాజిరెడ్డి.... కబడ్డీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన మాజీ సర్పంచ్ రాజిరెడ్డి....
చిన్న శంకరంపేట,అక్టోబర్ 12 (ప్రజాస్వరం): చిన్న శంకరంపేట మండల కేంద్రంలో కబడ్డీ ప్రీమియర్ లీగ్ (కె.పి.ఎల్) సీజన్-1 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కుమార్, ప్రవీణ్, పప్పు ఆధ్వర్యంలో...
ప్రజావాణిలో రెండు దరఖాస్తుల స్వీకరణ.. ఎంపీడీవో దామోదర్...
రైతుల పొట్ట కొడుతున్న రేవంత్ ప్రభుత్వం...
కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజమ్ చిత్రపటం దహనం...
మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు..
మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు...
రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలి....