రైతుల పొట్ట కొడుతున్న రేవంత్ ప్రభుత్వం...

కరెంటు కోతలపై రోడ్డెక్కిన బీజేపీ...

రైతుల పొట్ట కొడుతున్న రేవంత్ ప్రభుత్వం...

చిన్న శంకరంపేట - మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయింపు..

రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని డిమాండ్..

కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం..

 

చిన్న శంకరంపేట,అక్టోబర్ 12  (ప్రజాస్వరం) :

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. సోమవారం బీజేపీ మండల అధ్యక్షులు పోగుల రాజు ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా చిన్న శంకరంపేట - మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను రోడ్డుపైనే దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 420 అబద్ధపు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక కనీసం రైతులకు నాణ్యమైన విద్యుత్ కూడా అందించలేకపోతోందని మండిపడ్డారు.

రైతులు ఆరుగాలం ఎండనక, వాననక కష్టపడి పంటలను సాగు చేశారని, ఇప్పుడు పంటలు చేతికి వచ్చే కీలక సమయంలో కరెంటు కోతలు పెట్టడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. బావుల కింద, బోర్ల కింద నీరుండీ కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు కన్నీరు పెడుతున్నా ప్రభుత్వానికి చలనం లేదని విమర్శించారు. కనీసం రాబోయే 15 రోజుల పాటు పంటలను కాపాడుకోవడానికి వీలుగా నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ను సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్ అందించేంత వరకు బీజేపీ ఊరుకునేది లేదని, రైతుల పక్షాన నిలబడి నిరంతర పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ధర్నా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకుల రాజు, నాయకులు మల్లారెడ్డి, నరేందర్ రెడ్డి, దశరథ్, స్వామి, సక్రు నాయక్, రంజిత్ రెడ్డి, నాయిని ప్రసాద్, నాగరాజు, రాజు, ప్రసాద్, సురేష్ గౌడ్, బీజేపీ మండల, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Latest News

కబడ్డీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన మాజీ సర్పంచ్ రాజిరెడ్డి.... కబడ్డీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన మాజీ సర్పంచ్ రాజిరెడ్డి....
చిన్న శంకరంపేట,అక్టోబర్ 12 (ప్రజాస్వరం): చిన్న శంకరంపేట మండల కేంద్రంలో కబడ్డీ ప్రీమియర్ లీగ్ (కె.పి.ఎల్) సీజన్-1 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కుమార్, ప్రవీణ్, పప్పు ఆధ్వర్యంలో...
ప్రజావాణిలో రెండు దరఖాస్తుల స్వీకరణ.. ఎంపీడీవో దామోదర్...
రైతుల పొట్ట కొడుతున్న రేవంత్ ప్రభుత్వం...
కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజమ్ చిత్రపటం దహనం...
మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు..
మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు...
రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలి....