కబడ్డీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన మాజీ సర్పంచ్ రాజిరెడ్డి....

కబడ్డీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన మాజీ సర్పంచ్ రాజిరెడ్డి....

చిన్న శంకరంపేట,అక్టోబర్ 12 (ప్రజాస్వరం): 

చిన్న శంకరంపేట మండల కేంద్రంలో కబడ్డీ ప్రీమియర్ లీగ్ (కె.పి.ఎల్) సీజన్-1 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కుమార్, ప్రవీణ్, పప్పు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్రీడా సంబరాన్ని గ్రామ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి టాస్ వేసి అధికారికంగా ప్రారంభించారు. క్రీడలను ప్రోత్సహిస్తూ పోటీలను ప్రారంభించిన రాజిరెడ్డిని గ్రామస్తులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కాసేపు రాజిరెడ్డి గ్రామస్తులు కబడ్డీ ఆట ఆడారు, ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. క్రీడాకారులంతా కక్షపూరిత ధోరణి వీడి, క్రీడా స్ఫూర్తితో ఆడాలని, అంపైర్ల నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఇటీవల కాలంలో కొంతమంది యువకులు గంజాయి వంటి చెడు అలవాట్లకు బానిసలై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, తమ దృష్టిని క్రీడల వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు. ఆటల్లో కష్టపడి రాణించడం ద్వారా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని, ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు రవి, గ్రామ ప్రముఖులు మేడి గణేష్, శ్రీనివాస్, కుమ్మరి మహేష్, నల్ల కుమార్లతో పాటు పెద్ద సంఖ్యంలో యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Latest News

కబడ్డీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన మాజీ సర్పంచ్ రాజిరెడ్డి.... కబడ్డీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన మాజీ సర్పంచ్ రాజిరెడ్డి....
చిన్న శంకరంపేట,అక్టోబర్ 12 (ప్రజాస్వరం): చిన్న శంకరంపేట మండల కేంద్రంలో కబడ్డీ ప్రీమియర్ లీగ్ (కె.పి.ఎల్) సీజన్-1 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కుమార్, ప్రవీణ్, పప్పు ఆధ్వర్యంలో...
ప్రజావాణిలో రెండు దరఖాస్తుల స్వీకరణ.. ఎంపీడీవో దామోదర్...
రైతుల పొట్ట కొడుతున్న రేవంత్ ప్రభుత్వం...
కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజమ్ చిత్రపటం దహనం...
మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు..
మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు...
రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలి....