నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్...
By Prajaswaram
On
చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం..రజక సంఘ నాయకుల నిరసన.....
మెదక్, అక్టోబర్ 13 (ప్రజాస్వరం) :
మెదక్ జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం కావడం కలకలం రేపింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రజక సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు విగ్రహం వద్ద నిరసన తెలిపారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, సంయమనం పాటించాలని రజక సంఘ నాయకులకు సూచించారు. ఘటన పై దర్యాప్తు చేసి నిందితులను గుర్తిస్తామని హామీ ఇచ్చారు. సీసీ కెమెరాల నిఘా, విగ్రహానికి భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం పై రజక సంఘం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు ఘటనాస్థలికి చేరుకుని సంఘం నాయకులకు మద్దతు తెలిపారు. అనంతరం ఈ ఘటన పై రజక సంఘం నాయకులు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Latest News
13 Oct 2026 18:44:07
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.4,016 జీవనభృతి వెంటనే అమలు చేయాలి.. హామీని నిలబెట్టుకోకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు.. యూనియన్ నాయకులు.. నార్సింగి, అక్టోబర్ 13(...


