మూడవ రోజు అన్నపూర్ణ దేవిగా శ్రీ గడి మైసమ్మ తల్లి ....
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్ :
మేడ్చల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ గడి మైసమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారు శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ దేవి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు.అన్నపూర్ణ దేవి మాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని భక్తులు ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారి దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Latest News
13 Oct 2026 18:44:07
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.4,016 జీవనభృతి వెంటనే అమలు చేయాలి.. హామీని నిలబెట్టుకోకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు.. యూనియన్ నాయకులు.. నార్సింగి, అక్టోబర్ 13(...


