ఎంపీ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు....

బైండ్ల సత్యనారాయణ

ఎంపీ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు....

మెదక్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం):

 

ఎంపీ రఘునందన్ రావు పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు ఇస్నాపూర్ మున్సిపాలిటీ సంబంధించి ఎన్నికల్లో ఎంపీ రఘునందన్ రావు వ్యక్తిగతంగా పార్టీలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయడం జరిగిందన్నారు. కానీ దీన్ని రాజకీయం చేస్తూ కులాన్ని ముందుకు తీసుకువచ్చి ఎంపీ రఘునందన్ రావు ను బద్నాం చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఎంపీ గా రఘునందన్ రావు గా రాష్ట్రంలో మొదటి శత్రువు కాంగ్రెస్ కాబట్టి బి ఆర్ ఎస్ కు మద్దతు ఇచ్చారు తప్ప అందులో ఎలాంటి కుల రాజకీయం లేదని అన్నారు. ఈ విషయంలో విద్యార్థులను సైతం తప్పుదోవ పాటించి ఎంపీ దిష్టి బొమ్మలను దగ్దం చూపిస్తున్నారని ఇది సరైనది కాదని అన్నారు. ముదిరాజ్ సంఘం మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం యూత్ పట్టణ అధ్యక్షుడు ఇప్ప భరత్, మండల ఉపాధ్యక్షుడు సాయి, ఉప సర్పంచ్ నరేష్, చంద్రయ్య, వెంకట్, గోపాల్, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.

Latest News

పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహారించాలి... పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహారించాలి...
మెదక్, మార్చ్ 08 (ప్రజాస్వరం):   గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ 60 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి...
ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న సర్పంచ్....
బోర్లు వేశారు కానీ....
న్యాయవాది పై చేయి చేసుకోవడం హేయం....
మహిళ భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ సంతోష్ గోండ స్వామి యాదవ్ భూమి పూజ ....
తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గాంధీ విగ్రహం ధ్వంసం..... 
పాఠశాలలో ప్లేట్స్ పంపిణీ....