మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం..

ఆర్థిక సహాయం అందజేస్తున్న కాంగ్రెస్ నాయకులు

మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం..

గజ్వేల్ జనవరి 21 (ప్రజాస్వరం):

సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామనికి చెందిన ఈరబోయిన నాగరాజు గత కొద్ది రోజుల క్రితం మరణించారు. విషయం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ నాయకుడు కొన్యాల నర్సింహారెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అలాగే మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారితో పాటు వార్డు మెంబర్ సత్యనారాయణ, కోలా కృష్ణ తదితరులు ఉన్నారు