యూరియా కోసం బారులు తీరిన రైతులు...
చిన్న శంకరంపేట, జనవరి 30 ( ప్రజాస్వరం ) : చిన్న శంకరంపేట మండలంలోని మడూర్ గవలపల్లి లో యూరియా కోసం ఉదయం నుండి రైతులు దుకాణాల ముందు బారులు తీరారు, వరి నాట్లు వేసి యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని ఓవైపు యూరియా కొరత లేదంటూ అధికారులు సూచిస్తున్న ఇక్కడ మాత్రం యూరియా కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు, యూరియా సంచుల కోసం మహిళా రైతుల సైతం ఉదయం నుండే వరుసలు నిలబడి ఉన్నారు, నాట్లు వేయడం జరిగిందని యూరియా లేఖ వరి ఎర్రబడుతుందని ఉదయం ఇంటి వద్ద పనులను మానుకొని యూరియా కోసం రావడం జరిగిందని అధికారులు స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, ఒక రైతుకు ఒక సంచి ఇవ్వడం జరుగుతుందని, మరికొన్ని చోట్ల ఒక రైతుకు రెండు సంచులు యూరియా ఇవ్వడం జరుగుతుందని, రైతులకు సరిపడా యూరియా అందించాలని రైతులు కోరారు, ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ మండలంలో మడూర్, శంకరంపేట, గవలపల్లి మహాలక్ష్మి ఫెర్టిలైజర్ దుకాణాలకు 1560 సంచులు రావడం జరిగిందని రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని రైతులకు సరిపడా యూరియా అందించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తెలిపారు.


