తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు : హరీష్ రావు 

తెలంగాణ భవన్ లో మీడియాతో  హరీష్ రావు 

తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు : హరీష్ రావు 

 

హైదరాబాద్,  (ప్రజాస్వరం) : 

 తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి,  బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు హెచ్చరించారు. బనకచర్ల పేరు మారిన తెలంగాణకు ద్రోహం మారలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ కింద ఆంధ్ర కు గోదావరి జలాలను దారా దత్తం చేస్తుందని అన్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు అర్థం కావడం లేదని అన్నారు. బీఆర్ఎస్ పై ఆరోపణలు చేసే కేంద్ర మంత్రులు బండి సంజయ్,  కిషన్ రెడ్డిలు సోయి తెచ్చుకోవాలని అన్నారు. కత్తి చంద్రబాబుది పొడుస్తున్నది మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మన ప్రాజెక్టులను అడ్డుకుంటుంటే రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నీటి హక్కులను దారదత్తం చేసేందుకే ఢిల్లీలో మీటింగ్ లు పెడుతున్నారని మండిపడ్డారు.

Latest News

అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు... అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...
ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి...
క్యాంప్ కు తరలిన బీఆర్ఎస్  ... గెలుపు పై ధీమా....
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి...
ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....