వడ్డేపల్లి గ్రామంలో విస్తృత స్వచ్ఛత కార్యక్రమాలు....

సర్పంచ్ రేణుక

వడ్డేపల్లి గ్రామంలో విస్తృత స్వచ్ఛత కార్యక్రమాలు....

పరిశుభ్రమైన గ్రామమే అభివృద్ధికి పునాది 

వడ్డేపల్లిదౌల్తాబాద్ 25 (ప్రజాస్వరం):

ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ రాజా గారి రేణుక అన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామంలో విస్తృత స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధులు, అంతర్గత రహదారులు, డ్రైనేజీల వద్ద పేరుకుపోయిన చెత్త చెదారాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో తొలగించారు. అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సర్పంచ్ రేణుక మాట్లాడుతూ పరిశుభ్రమైన గ్రామమే అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.

గ్రామాభివృద్ధి ప్రభుత్వంతో మాత్రమే సాధ్యం కాదని, ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటి ముందు చెత్త వేయకుండా నిర్ణీత ప్రదేశాల్లోనే చెత్తను వేయాలని సూచించారు. స్వచ్ఛత పాటిస్తే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని, గ్రామం మరింత అందంగా తీర్చిదిద్దబడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు సునంద, సి.ఏ. శోభతో పాటు పంచాయతీ సభ్యులు, పారిశుధ్య కార్మికులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...