బాధిత కుటుంబానికి మాజీ డిప్యూటీ స్పీకర్ ఆర్థిక సహాయం...
By Prajaswaram
On
మెదక్ మార్చ్ 17 (ప్రజాస్వరం):
హవేలీ ఘనపూర్ మండలం లింగాసాన్ పల్లి తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కేతావత్ వాసురాం ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారు. ఈ విషయం నాయకుల ద్వారా తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. కేతావత్ వాసురాం మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నర్సారెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సూర్య నాయక్, నాయకులు కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
27 Mar 2026 19:01:43
జగదేవ్ పూర్, మార్చి 27 (ప్రజాస్వరం ):జగదేవ్‌పూర్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జంగంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం...


