సర్పంచ్ అద్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు...
అనంతరం సర్పంచ్ కీ సన్మానం చేసిన కనకయ్య, శ్రీకాంత్
By Prajaswaram
On
గజ్వెల్, జనవరి 25 (ప్రజాస్వరం):
సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం అక్కరం గ్రామంలో బీజేపీ నాయకులు ఆదివారం గ్రామ సర్పంచ్ గౌలికర్ శ్రీవాణి హన్మంతు సమక్షంలో గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు బూడిగే కనకయ్య, శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా సర్పంచ్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అకర్షితులై పార్టీలో చేరుతున్నారని పార్టీలో చేరే వారికి అన్ని విధాలా అండగా ఉండి గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూడిగే స్వామి, ఎల్లం, నరసింహులు,వార్డు మెంబర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
Latest News
06 Feb 2026 20:57:57
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...


