దుబ్బాక ఏరియా ఆసుపత్రికి రెండవసారి అవార్డు
అవార్డు లకు అడ్డాగా దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి..
దుబ్బాక , నవంబర్ 7 (ప్రజాస్వరం) :
సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ కేద్రం 5 మార్చ్2023 లో 05 డయాలసిస్ బెడ్స్ తో ప్రారంభించడం జరిగింది, అప్పటినుండి ఈరోజు వరకు 10,000 కేసులు డయాలసిస్ చేయడం జరిగినది. అపెక్స్ కిడ్నీ కేర్ ప్రవేట్ లిమిటెడ్ ముంబై వారు దుబ్బాక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్రములోని మొత్తం డయాలసిస్ సెంటర్లలో మన దుబ్బాక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మొదటి స్థానములో బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు 2024 లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మల్లి రెండవసారి 2025 లో రావడం జరిగింది.దీనికి కృషి చేసిన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డా,, హేమరాజ్ సింగ్ , డయాలసిస్ ఇంచార్జి శేఖర్ మరియు డయాలసిస్ సిబ్బంది-సురేష్, స్వామి,మానస,వివేక్,రమేష్ మరియు హాస్పిటల్ సిబ్బంది ఎంతో కృషి చేయటం జరిగింది.


