గంజాయి బ్యాచ్ అరెస్టు...

గంజాయి బ్యాచ్ అరెస్టు...

ప్రజాస్వరం : శామీర్ పేట, ఏప్రిల్ 15 

 

మేడ్చల్ జిల్లా, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరులో గంజాయి అమ్ముతున్న ముఠాను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొల్తూరు నుంచి తుర్కపల్లి వెళ్లే ఓ గ్రౌండ్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నట్లు ముందస్తు సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. కొల్తూర్ ప్రాంతాల్లో13 మంది గంజాయి అమ్ముతుండగా పోలీసులు దాడులు చేశారు.ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో ఏడు మంది పరారయ్యారు. వీరి వద్దనుండి సుమారు రెండు లక్షల వరకు విలువ చేసే 3 కిలోల గంజాయిని, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని తుర్కపల్లిలోని జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.పట్టుబడిన వారంతా చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన యువకులుగా గుర్తించారు.

Latest News

బీజేపీ శ్రేణులు ధర్నా..... బీజేపీ శ్రేణులు ధర్నా.....
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23    ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....
ఘనంగా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం.....
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం.....
రోడ్డు ప్రమాదాలు జరగకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి..
నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..