ప్రజల సహకారంతో ప్రమాదాలకు చెక్..
సీఐ రవీందర్ రెడ్డి
By Prajaswaram
On
చైనా మాంజ తొలగింపుకు స్పెషల్ డ్రైవ్
బొల్లారం, జనవరి 31(ప్రజాస్వరం):
పక్షులకు, మనుషులకు ప్రాణాంతకంగా మారుతున్న చైనా మాంజ వల్ల ప్రమాదాలు జరగకుండా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
చెట్లపై, ఎలక్ట్రికల్ స్థంభాలపై చిక్కుకున్న చైనా మాంజను ప్రజల సహకారంతో పోలీస్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా రహదారులపై ప్రయాణించే వాహనదారులు, కాలనీవాసులు ఎదుర్కొంటున్న ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమం సందర్భంగా పోలీస్ శాఖ పత్రికా ముఖంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, నిషేధిత చైనా మాంజను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దని సూచించింది. చైనా మాంజ వాడకం వల్ల మనుషులు, పక్షులు తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉందని బొల్లారం సీఐ మూల రవీందర్ రెడ్డి హెచ్చరించారు.
Latest News
31 Jan 2026 17:07:10
ఆదిలాబాద్ , జనవరి 31(ప్రజాస్వరం): ఆదిలాబాద్ జిల్లా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ప్రతిపాదించిన యూనివర్సిటీని నిర్మల్ జిల్లాలో కాకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు...


