ప్రభుత్వం వెంటనే జాక్ తో చర్చలు జరపాలి...
రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్....
తూప్రాన్, ఏప్రిల్ 14 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలోని 20 వేల మంది ఆర్టిజన్లు మరో అయిదు వేల మంది ఔట్సోర్సింగ్ పీస్ రేటు బిల్ కలెక్టర్లు అన్ మాన్ వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. గత ఏడు రోజులుగా సమ్మెలో ఉన్నారు. వీళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఈరోజు తూప్రాన్ లోని విద్యుత్ కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి TSUEEU (CITU) రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్ డిమాండ్ చేశారు. ఆర్టిజన్ అడుగుతున్న కన్వర్జేషన్ గాని ఏపీఎస్ఈబీ సర్వీసు రూల్ అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. ముఖ్యమంత్రి గ విద్యుత్ శాఖ మంత్రి జోక్యం చేసుకొని అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలి.అని ఆయన కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు ఆర్టిజన్ల సమస్యలు పరిష్కారం చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాలు గడిచిన నేటికీ పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలోని 25 వేల మంది ఏకతాటి గా జేఏసీ ఏర్పాటు చేసుకొని సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమ్మెకు ప్రధాన భాద్యత ప్రభుత్వమే వహించాలి .ప్రజలకు అసౌకర్యాలు ఇబ్బంది కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సమ్మె చేస్తున్న వాళ్ళు చట్టబద్ధంగా సమ్మె నోటీస్ ఇచ్చి చేస్తున్నారు.దాని పరిగణలోకి తీసుకోకుండా జెన్కోలో ని కేటీపీఎస్ అనేక ప్రాంతాల్లో టర్మినేషన్ ఆర్డర్స్ ఇవ్వడం దుర్మార్గం. తక్షణమే టర్మినేషన్ ఆర్డర్స్ ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ నిర్బంధ కాండము వినడానికి సమస్యలు పరిష్కారం చేయాలి అలాగే 5000 మంది ఔట్సోర్సింగ్, పిస్ రేటు ,బిల్ కలెక్టర్లు తదితరులకు కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. వాళ్లకు కనీస వేతనం ఇవ్వాలి. పనిగంటలు అమలు చేయాలి. పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు వర్తింప చేయాలి.వీటినీ కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదంటే ప్రభుత్వం కార్మిక వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నదని అర్థమవు తున్నది. విద్యుత్ కార్మికుల సమయం పట్టించుకోకుండా కాలయాపన చేస్తే రాబోయే కాలంలో అన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇతర సంఘాన్ని కలుపుకొని వారికి మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని వారు హెచ్చరించారు. పోతరాజు పల్లి కమాన్ నుండి బస్ స్టాప్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారికి ఆర్టిజన్ల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి. TSUEEU (citu)యూనియన్ అధ్యక్షులు,కార్యదర్శి రవీంద్ర ప్రసాద్, యం. నర్సింలు,tvae jac నాయకులు రాజీ రెడ్డి,షాదుల్, రాజు,రాజు నాయక్,ఫాసి,నవనిత,యాదగిరి, అశోక్,తదితరులు పాల్గొన్నారు.


