మిలాద్-ఉన్-నబి భారీ ర్యాలీ.
By Prajaswaram
On
మిలాద్-ఉన్-నబి భారీ ర్యాలీ....
మెదక్ సెప్టెంబర్ 14 (ప్రజా స్వరం)
మెదక్ జిల్లా కేంద్రం లో ముస్లింలు మిలాద్-ఉన్-నబి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ముస్లింలు భారీ ర్యాలీ వైభవంగా జరుపుకున్నారు. ఇస్లాం మత స్థాపకుడైన మహ్మాద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ముస్లింలు ఏటా ఈ ర్యాలీ నిర్వహిస్తుంటారు. మొదటగా ఈ ర్యాలీ మెదక్ లోని జిలానీ గడ్డ నుండి పెద్ద బజార్, పోస్ట్ ఆఫీస్, బస్ స్టాప్, రాందాస్ చౌరస్తా, క్రిస్టల్ గార్డెన్స్ వరకు కొనసాగింది. మహిళలు, పురుషులు, ముఖ యువతీ, యువకులు, చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించారు. ర్యాలీ ఆసాంతం మహ్మాద్ ప్రవక్త పై రచించిన గీతాలను ఆలపిస్తూ ముస్లింలు ముందుకు సాగారు. ఈ సందర్భంగా మసీదుల్లో మహ్మాద్ ప్రవకర్త, ఆయన చేసిన త్యాగాలు, సేవలను ఇమామ్లు ముస్లింలకు వివరించారు. మహ్మాద్ ప్రవక్త బాటలో నడవాలని పిలుపునిచ్చారు.
Related Posts
Latest News
17 Sep 2025 11:28:55
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...