తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు

 రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు

తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు :  రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
 నూతన క్రీడా విధానంతో మారనున్న  క్రీడారంగ ముఖచిత్రం
 సీఎం రేవంత్ గారి ఆలోచనల ప్రతిరూపమే నూతన క్రీడా విధానం :   మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్ / వనపర్తి  ( ప్రజాస్వరం ) :

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు సమగ్రమైన  తెలంగాణ క్రీడా విధానం 2025 ను రూపొందించామని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.  వనపర్తి నియోజకవర్గం ఆత్మకూరు కేంద్రంలో స్పోర్ట్స్ కాంప్లెవ్ పోస్టర్ ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  దశాబ్ద కాలం నుండి విస్మరించబడ్డ క్రీడా రంగము సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో వేగవంతంగా పనిచేస్తూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి జరుగు తోందని అన్నారు. తాను క్రీడల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన  మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే క్రీడారంగం ఆమోదింపబడటము ఒక క్రీడాకారుడిగా తనకి ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. ఈ నూతన క్రీడా విధానాన్ని పటిష్టంగా పకడ్బందీగా అమలు చేయడానికి  దేశవ్యాప్తంగా ఉన్న వివిధ క్రీడారంగా నిష్ణాతులు వివిధ క్రీడా సమాఖ్యల ప్రతినిధుల తో కలిసి విస్తృత స్థాయిలో ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడా విధానం2025 తెలంగాణ క్రీడా రంగానికి ఒక నూతన వరవడిని సాధించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడా రంగానికి క్రీడాకారులకు మంచి భవిష్యత్తును అందజేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి, మట్టిలో మాణిక్యాల ను  గుర్తించి వారిని ప్రపంచ ఛాంపియన్లుగా ఇది ఈ క్రీడా విధానం ఎంతో దోహదం చేస్తుందని ఆయన అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, నూతన క్రీడా విధానంతో  తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ బాధ్యతలు మరింత విస్తరించబోతున్నాయని వివిధ శాఖల సమన్వయంతో విస్తృతంగా క్రీడా కార్యక్రమాలను నిర్వహించడానికి, క్రీడాకారుల ను ప్రోత్సహించడానికి బహుముఖంగా తెలంగాణ స్పోర్ట్స్ తాటి సేవలు అందజేయడానికి ఈ విధానం ఎంతగానో దోహదం  చేస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారి కృషి వల్ల  తెలంగాణ క్రీడారంగ ముఖచిత్రమే మారిపోతుందని ఆయన వివరించారు.ఒక ఏడాదికాలంగా  తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఎన్నో  జాతీయ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించామని, రానున్న రోజుల్లో ఈ కృషిని మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగిస్తామని  ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్  రహమతుల్లా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Latest News

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...
సమయపాలని పాటించని ఉద్యోగులపై మెదక్ కలెక్టర్ కొరడా 
పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
బీజేపీలో భారీగా చేరికలు  
ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....
సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..