గ్రూప్ 2 ఫలితాలు వెల్లడించి ఆరు నెలలు అవుతుంది.
-అపాయింట్మెంట్ పత్రాలు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు కు వినతిపత్రం.
By Prajaswaram
On
పెద్దపల్లి,సెప్టెంబర్13(ప్రజా స్వరం):
గ్రూప్ 2 ఫలితాలు వెల్లడించి ఆరు నెలలు కావస్తున్నాయని వెంటనే సర్వీసెస్ నీ కేటాయించి అపాయింట్మెంట్ పత్రాలు అందజేయాలని గ్రూప్ 2 సాధించిన అభ్యర్థులు రాష్ట్ర యువజన నాయకుడు గోమాస సచిన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును కోరారు.మంత్రి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు.మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించి అతి త్వరలో అపాయింట్మెంట్ పత్రాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందిస్తామని హామీ ఇచ్చారని గ్రూప్ 2 అభ్యర్థులు తెలిపారు.అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు.
Latest News
17 Sep 2025 11:28:55
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...