రోడ్డు ప్రమాదంలో ఒకరు

రోడ్డు ప్రమాదంలో ఒకరు

దౌల్తాబాద్‌లో రోడ్డు ప్రమాదం: వ్యక్తి


దౌల్తాబాద్ జనవరి 12( ప్రజాస్వరం ):


 సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఒక వ్యక్తి మృతి చెందాడు. మల్లేశంపల్లి గ్రామానికి చెందిన పుర్రె కనకయ్య ద్విచక్ర వాహనంపై దౌల్తాబాద్ నుండి మల్లేశంపల్లికి వెళ్తుండగా, కోనాపూర్ మొండి చింత బస్‌స్టాప్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది.
ఈ ఘటన శేర్‌పల్లి–బందారం గ్రామపంచాయతీ పరిధిలోని మధురై గ్రామం, నర్సంపేట శివారులో  జరిగింది. ప్రమాదం తీవ్రతతో, కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రమాదానికి కారణాలు ఇంకా సుస్పష్టంగా తెలియాల్సి ఉందని సంఘటన స్థలంలో పరిశీలన కొనసాగుతున్నదని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో రోడ్డు పరిస్థితులు, మరియు ఎదురుగా వస్తున్న వాహనంపై పూర్తి పరిశీలన దర్యాప్తులో భాగంగా జరుగుతోందన్నారు.