మేడ్చల్ పాలిటెక్నిక్ కళాశాలలో నీటి కొరత...
కిరణ్ కుమార్....
ప్రజాస్వరం : మేడ్చల్, ఏప్రిల్ 15
మేడ్చల్పాలిటెక్నిక్ కళాశాలలో నీటి కొరతను తీర్చాలని యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ మండల కార్యదర్శి కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ మండల కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ మేడ్చల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు నీటి సమస్య వెంటాడుతుందని అన్నారు. విద్యార్థులు స్నానం చేయడానికి కూడా కళాశాలలో ఎటువంటి నీళ్ల సౌకర్యం లేదని దానివల్ల కళాశాల పక్కనే ఉన్న కార్వీ గుంతలలో విద్యార్థులు స్నానాలు చేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. క్వారీలో స్నానం చేయడానికి వెళ్లిన విద్యార్థులు క్వారీలో పడి చనిపోయే ప్రమాదం ఉందని , జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు.ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు ,జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మేడ్చల్ పాలిటెక్నిక్ కళాశాలకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల పక్షాన నిలబడి అందరిని ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.


