ఘనంగా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు....

ఘనంగా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు....

నార్సింగి, ఏప్రిల్ 11 ( ప్రజాస్వరం ):

 

నార్సింగి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కండ్లకొయ్య యాదగిరి ఆధ్వర్యంలో ఎస్బీఐ బ్యాంకు సమీపంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, మండల అధ్యక్షులు కండ్లకొయ్య యాదగిరి, ఆకుల మల్లేశం గౌడ్, కుమ్మరి బాబు లు మాట్లాడుతూ భారతదేశంలో సామాజిక సంస్కరణోద్యమానికి మహాత్మా జ్యోతిరావు పూలే నాంది పలికారని, స్త్రీ విద్య, కుల వ్యవస్థ నిర్మూలన, వితంతు వివాహం వంటి సామాజిక సమస్యలపై పోరాడిన మహనీయుడు. మహిళలకు, దళితులకు విద్య అవసరాన్ని గుర్తించి, 1848లో సావిత్రీబాయి పూలేతో కలిసి భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని ఫూలే సేవలను కొనియాడారు. అలాగే ఎస్బీఐ ప్రక్కన జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఈ సందర్బంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, పసులోటి మోతిలాల్, పున్నా రమేష్, ఎం.కే. రాజు, బొమ్మల మైసయ్య తదితరులు పాల్గొన్నారు.