తూప్రాన్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 1 (ప్రజాస్వరం) తూప్రాన్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఉదయం మున్సిపల్ ముసాయిదా ఓటర్ జాబితాలో మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో పబ్లికేషన్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఉదయం 10:30 గంటలకు ముసాయిదా ఓటరు జాబితాలో పబ్లికేషన్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 16 వార్డులు ఉండగా, 20,427 మంది ఓటర్లు ఓటర్లు ఉన్నారు. మహిళలు 10,100, పురుషులు 10,327 మంది ఓటర్లు ఉన్నారు ప్రాజ ప్రతినిధులు ఏమైనా మార్పులు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేయాలని కమిషనర్ గణేష్ రెడ్డి తెలిపారు మొదటి వార్డులో అత్యధికంగా ఓట్లు ఉండగా రెండవ వార్డులో అతి తక్కువ ఓట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు
Latest News
11 Jan 2026 14:39:33
శివ్వంపేట, జనవరి 11 ( ప్రజా స్వరం ) : యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని శభాష్ పల్లి సర్పంచ్ అయ్యగారి యాదగిరి అన్నారు. సంక్రాంతి సందర్భంగా...


