మహనీయుల త్యాగాలు మరువలేనిది.....

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్....

మహనీయుల త్యాగాలు మరువలేనిది.....

జిల్లా లో ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు..... 

ఘనపూర్ ఆనకట్ట మధ్య తరహా ప్రాజెక్ట్ 4364.00 లక్షలు మంజూరు.....

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు...

మెదక్, జనవరి 26 (ప్రజాస్వరం):

భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 77 రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి కలెక్టరేట్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎస్పీ డి. వి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ భారతదేశం గణతంత్ర దేశంగా ఏర్పడి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా పౌరులకు, అధికారులకు, విద్యార్థిని విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 77 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలంగా సిద్ధించిన స్వాతంత్య్ర ఫలాలు అందరికి అందాలని డా|| బాబా సాహెబ్ అంబేద్కర్ అధ్వర్యంలో ప్రపంచంలోనే పెద్దదైన, గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రచించి మనకు అందించారని అన్నారు. నేడు రాజ్యాంగ నిర్మాతలైన ఆ మహానీయులను గుర్తు చేసుకోవడం మన భాద్యత అన్నారు. తెలంగాణా రాష్ట్ర సాధనలో ఎందరో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం పోరాడి అమరులైనారు, వారి త్యాగాలను ఈ రాష్ట్రము ఎప్పటికి మరువదు తెలిపారు. సాధించిన ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని గౌరవ ప్రజా ప్రతినిధుల, అధికారుల, ప్రజల సహకారంతో ప్రభుత్వ పథకాల అమలులో మెదక్ జిల్లా ఎప్పుడు ముందడుగులోనే ఉంటుందని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహా లక్ష్మి పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 3 కోట్ల 62 లక్షల సార్లు మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుని, 126 కోట్ల 57 లక్షల రూపాయల లబ్ది పొందారని అన్నారు. జిల్లా లో గృహ జ్యోతి కార్యక్రమం ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకుంటున్న 1 లక్ష 28 వేల 811 మంది వినియోగదారులకు ఇప్పటి వరకు 84 కోట్ల 58 లక్షల సబ్సిడి పొందినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున, వానాకాలం 2025-26 సంవత్సరమునకు గాను మొత్తం 2,62,043 మంది రైతుల ఖాతాల్లో 220 కోట్ల 84 లక్షలు జమ చేయడం జరిగిందని అన్నారు. దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని అన్నారు. మెదక్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 87 వేల 491 మంది రైతులకు 645 కోట్ల 41 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు, ఈ పథకం ద్వారా పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మెదక్ జిల్లాలో 31 వేల 041 మంది పేదల కోసం ప్రభుత్వం 85 కోట్ల 18 లక్షల 47 వేల రూపాయల ప్రభుత్వ ఖర్చుతో నెట్వర్క్ ఆస్పత్రులలో శస్త్ర చికిత్సలు చేయించినట్లు పేర్కొన్నారు. 500 రూపాయలకే వంట గ్యాస్ పథకం లో ఇప్పటి వరకు 1,26,961 మంది లబ్దిదారులకు 4,68,195 గ్యాస్ సిలిండర్లు 500/- లకే సప్లై చేయడం జరిగిందని, దీనికి 13.18 కోట్ల  సబ్సిడీ క్రింద ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. సన్న బియ్యం కు క్వింటాలుకు 500/- బోనస్ కింద 32,193 రైతుల ఖాతాలలో 61.53 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల సబ్సీడి పై 460.45 కోట్లతో మొదటి విడతలో (9209) ఇండ్లు మంజూరి చేయడం చేశామని, ఇప్పటికే (6377) ఇండ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయని అన్నారు. అందులో భాగంగా నిర్మాణ ప్రగతిని బట్టి (4796) మంది లబ్దిదారులకు వారి ఖాతాలలో 101.29 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ఇప్పటి వరకు 371 మంది రైతులకు 1629 ఎకరాల విస్తీర్ణములో 457 లక్షల రూపాయల సబ్సిడీతో ఆయిల్ పామ్ తోటల సాగు చేపట్టడం జరిగిందని అన్నారు. మైక్రో ఇరిగేషన్ పథకం ద్వారా 476 మంది రైతులకు 1156 ఎకరాల విస్తీర్ణములో బిందు, తుంపర సేద్య పరికరాలకు 381.64 లక్షల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు. మెదక్ జిల్లా లోని రామాయం పేట్ మండలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సిషియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 200 కోట్లలతో ప్రారంభించడం జరిగిందని అన్నారు. మెదక్ జిల్లాలో చేయూత పెన్షన్ పథకం ద్వారా లక్ష 09 వేల 572 మంది లబ్దిదారులకు 24 కోట్ల 52 లక్షల రూపాయలు పించనులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజి ద్వారా 5 వేల 683 సంఘాలకు 564 కోట్ల 40 లక్షల ఋణాలు అందించడం జరిగిందని, 2025-26 సంవత్సరములో 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరమునకు సంబంధించి వడ్డీ లేని ఋణాలు క్రింద 10,574 సంఘాలకు 21.68 కోట్ల వడ్డీ డబ్బులు మంజూరు చేయడం జరిగిందనీ అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మెదక్ జిల్లాలో లక్ష 94 వేల 322 మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 450 స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా 57 కోట్ల 73 లక్షల రూపాయల రుణాన్ని మంజూరి చేయడం జరిగిందని అన్నారు. 2023-24, 2024-25 సంవత్సరమునకు వడ్డీలేని రుణాల పంపకం ద్వారా 854 మహిళా సంఘాలకు 3 కోట్ల 9 లక్షల వడ్డీ డబ్బులు మంజూరు చేసినట్లు తెలిపారు. స్త్రీ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు 473 స్వయం సహాయక సంఘ సభ్యులకు 13 కోట్ల 48 లక్షల రూపాయలు ఋణాలు ఇచ్చామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఇందిరా మహిళా శక్తి" లో భాగంగా 2025-26 సంవత్సరములో నుండి ఇప్పటి వరకు 152 వ్యక్తిగత యూనిట్ల లక్ష్యం కు 5 కోట్ల 38 లక్షల 70 వేల ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి పధకంలో భాగంగా జిల్లాలో 03 క్యాంటీన్ లు మహిళా సంఘాల ద్వారా నిర్వహించడం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రామాయం పేట్, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో 18,480 ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు పంపిణి చేయడం జరిగిందని అన్నారు. మెదక్ జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమం ద్వారా 37 లక్షల 10 వేల మొక్కలు నాటే లక్ష్యం కాగా ఇప్పటి వరకు 38 లక్షల 33 వేల మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. 2025-26 సం. లో 100% రాయితీ ఉచిత చేప పిల్లల పంపకం లో భాగంగా జిల్లా లో 913 చెరువులలో 345.54 లక్షల చేప పిల్లలు 358.168 లక్షల ఖర్చుతో విడుదల చేయడంతో 15761 మంది మత్స్య కారులు ప్రత్యక్షముగా జీవనోపాధి పొందుతున్నట్లు తెలిపారు. జిల్లా లోని ఘనపూర్ ఆనకట్ట మధ్య తరహా ప్రాజెక్ట్, కొల్చారం మండలం చిన్న ఘనపూర్ దాని ఆనకట్ట ఎత్తు పెంచి పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 4364.00 లక్షలు మంజూరు చేయడం జరిగిందనీ అన్నారు. పునరుద్ధరణ పనులు 57.28% పూర్తి చేసి, ఎత్తు పెంచుట పనులు పురోగతిలో ఉన్నాయని, దీంతో 21625 ఎకరాల నుండి 26625 ఎకరాల వరకు సాగులోకి రానున్నట్లు పేర్కొన్నారు. వన దుర్గా ప్రాజెక్ట్ ఆధునికీకరణ కై ప్రభుత్వము వాటి పునరుద్ధరణ పనులు 5032.50 లక్షలు మంజూరు చేసిందని, పనులు 56 % పూర్తయ్యాయని అన్నారు. జిల్లా లో విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, రోడ్లు, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీలు, మునిసిపాలిటీలు, వాటర్ సప్లై, వెటర్నరీ, ఇతర అన్ని శాఖలలో విప్లవాత్మకమైన అభివృద్ధి సాధించడం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో, నేరాలు నిరోధించడంలో, రహదారుల ప్రమాదాల నివారణలో, మత్తు పదార్థాల, సైబర్ నేరాల నియంత్రణ కొరకు కృషి చేస్తున్న పోలిస్ యంత్రాంగానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి విజయవంతం చేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు. జిల్లాను అన్ని రంగాలలో మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రజలు, ఉద్యోగులు, ప్రతి ఒక్కరు పని చేయాలనీ విజ్ఞప్తి చేశారు.