ఏడవ వార్డులో బీజేపీ నాయకుల సర్వే...
By Prajaswaram
On
గజ్వెల్, జనవరి 26 (ప్రజాస్వరం):
గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు ఇంచార్జ్ వర్గల్ బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. సింగారం పోచమ్మ టెంపుల్ లో దర్శనం అనంతరం సింగారం,ఎర్రవల్లిలో సర్వే చేశారు. పలు వర్తక వ్యాపార సంస్థల వ్యక్తులను ,యూత్,మహిళల ను కలసి,వాళ్ల సూచనలు అడిగి తెలుసుకున్నారు. 7 వార్డులో బిజెపి పార్టీ ఎలా ఉంది ఎవరికి బిఫారం ఇస్తే బాగుంటుంది అని అడిగి వాళ్ల అభిప్రాయ సేకరణ తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్ గా సీతారాంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ,వెంకటేష్ పాల్గొన్నారు.
Latest News
07 Feb 2026 21:32:18
మేడ్చల్, ఫిబ్రవరి 07 (ప్రజాస్వరం): జిహెచ్ఎంసి మేడ్చల్ డివిజన్లోని సర్వే నంబర్ 1045/1 లోని స్థలాన్ని కొందరు రియేటర్లు కబ్జా చేశారని, స్థానిక ఉమా వెంకట్ రెడ్డి...


