క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటాలి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటాలి
రాష్ట్ర పోటీల్లో ప్రతిభ చూపిన జట్టుకు ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు, జనవరి 04( ప్రజా స్వరం)
పటాన్‌చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ విభాగంలో రెండవ స్థానం, అలాగే మార్చ్ ఫాస్ట్ విభాగంలో ప్రథమ స్థానం సాధించిన సంగారెడ్డి జిల్లా జట్టుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ట్రోఫీలు బహూకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగనున్న జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో కూడా ఇదే స్పూర్తితో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని క్రీడాకారులకు విజ్ఞప్తి చేశారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాలకు తన వంతు పూర్తి సహకారం, సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మర్రి లక్ష్మారెడ్డి, సంగారెడ్డి జిల్లా కన్వీనర్ గురువా రెడ్డి, బిహెచ్ఇఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ఐలేష్ యాదవ్, అలాగే అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


