జాతీయ స్థాయి కి ఎంపికైన విద్యార్థిని మహతి సన్మానం ....

జాతీయ స్థాయి కి ఎంపికైన విద్యార్థిని మహతి సన్మానం ....

తూప్రాన్, ఫిబ్రవరి 21 (ప్రజాస్వరం) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ గీతా స్కూల్ విద్యార్థిని బి. మహతి తయారు చేసిన " వ్యర్థాల నిర్వహణ - ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం " అనే అంశం పై తయారు చేసిన ప్రాజెక్ట్ జాతీయ స్థాయికి ఎంపిక అయింది. అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సన్మానించి అభినందించారు.  జనవరి 7 నుండి 9 వరకు కామారెడ్డి లో జరిగిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో దక్షిణ భారత స్థాయి తోపాటు జాతీయ స్థాయికి సైతం ఎంపికయ్యింది. దక్షిణ భారత స్థాయిలో సంగారెడ్డి జిల్లా 

కొల్లూరు లో జనవరి 19 నుండి 23 వరకు జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో సైతం తృతీయ బహుమతి సాధించింది.

ఈ సందర్బంగా మెదక్ జిల్లా కలెక్టరేట్ లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థిని మహతిని అభినందించారు. ఈ కార్యక్రమం లో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,రాజేశ్వర్ సల్మా తదితరులు పాల్గొన్నారు. విద్యార్ధిని మహతి గీతా పాఠశాల యాజమాన్యం ఉషారాణి రామాంజనేయులు రాఘవేంద్ర గౌడ్ సన్మానం చేసి అభినందనలు తెలిపారు.

Latest News

వైస్ చైర్ పర్సన్ దంపతులకు మిత్రుల ఘన సన్మానం.... వైస్ చైర్ పర్సన్ దంపతులకు మిత్రుల ఘన సన్మానం....
గజ్వేల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కర్ పద్మాబాయి నర్సింగరావు గజ్వేల్, 22 ఫిబ్రవరి (ప్రజాస్వరం ):   సిద్దిపేట జిల్లా...
హిందూ ముస్లింల ఐక్యత కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి...అబుల్ కలాం ఆజాద్....
జాతీయ స్థాయి సైన్స్ కి ఎంపికైన విద్యార్థిని అభినందించిన కలెక్టర్..
ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు...
తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం లో ప్రత్యేక పూజలు.....
ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు...
రాగి జావా తాగి ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత.. ..