న్యాయవాదుల రక్షణ చట్టాలు అమలు చేయాలి...
మెదక్ డిసెంబర్ 16 (ప్రజా స్వరం) :
రాష్ట్రం లో న్యాయవాదులపై జరుగుతున్న దాడులపై పట్టిష్టమైన రక్షణ చట్టాలను తీసుకుని రావాలని హుజూరాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది సమూల రాంరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ జిల్లా కోర్టు సముదాయ ప్రాంగణంలో ఆయన న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల కోసం ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకునివచ్చి, వారి పై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో పని చేస్తున్న జూనియర్ న్యాయవాదులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 41 సీఆర్పిసి కాకుండా అడ్వకేట్ల పై జరుగుతున్న దాడుల విషయంలో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకుని వస్తానని అన్నారు. ప్రతి న్యాయవాదికి 5 లక్షల ఉండే ఇన్సూరెన్స్ ను 10 లక్షలకు పెంచే విధంగా ప్రభుత్వానికి విన్నవిస్తానని అన్నారు. తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడిగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మార్కంటి రాములు, ప్రతాప్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పోచయ్య, సంతోష్ రెడ్డి, రవీందర్, రవి గౌడ్, వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


