అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు

అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు

 

 రామయంపేట. 17.( ప్రజాస్వరం )

Read More డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన  సీఈవో

మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్ హోటళ్లు, రెస్టారెంట్ల పై,చర్యలు తీసుకుని, ఆహార భద్రత ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యయంగా విస్తృత తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని మెదక్ జిల్లా ఆహార భద్రత నియంత్రణ అధికారి స్వదీప్ కుమార్ తెలిపారు.బుధవారం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీ నిర్వహించారు.ఈ తనిఖీలో  గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు - దుకాణంలో బూజు బట్టిన  ఉన్న పాపడ్‌లు కనిపించాయి, స్టోర్ రూమ్‌లో దొరికిన గడువు ముగిసిన షెజ్వాన్ సాస్ బాటిళ్లను రెస్టారెంట్‌లోని చైనీస్ వంటగదిలో ఉపయోగిస్తున్నారు. ఈ వస్తువులను ధ్వంసం చేశారు. ఇతర ఉల్లంఘనలను గుర్తించి నోటీసు జారీ చేశారు, జరిమానా విధించడానికి కేసు నమోదు చేయడానికి పంచమామ చేశారు.ఈ సందర్భంగా ఆహార భద్రత తనిఖీ అధికారి స్వదీప్.కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటల్ లో రెస్టారెంట్లు యాజమాన్యాలపై ఫుడ్‌సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నదని అన్నారు. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్‌ మార్కెట్లు, ఐస్‌క్రీం పార్లర్లు ఇతర వాటిపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.ఈ తనిఖీలలో ఫుడ్ శాంపిల్స్ అసిస్టెంట్ నజీర్, సిబ్బంది, అరవింద్ పాల్గొన్నారు.

Read More హనుమాన్ గుడి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి 

Latest News

అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు
      రామయంపేట. 17.( ప్రజాస్వరం ) మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్ హోటళ్లు, రెస్టారెంట్ల పై,చర్యలు తీసుకుని, ఆహార భద్రత
హనుమాన్ గుడి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి 
బాధిత కుటుంబానికి అండగా అంజిరెడ్డి...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు
క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుదాం : : పట్నం మహేందర్ రెడ్డి 
రెండేళ్లుగా అభివృద్ధి లేదు : మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 
 ఏసీబీ వలలో ఓయూ డీ ఈ