రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు

 

దౌల్తాబాద్ డిసెంబర్ 16 ( ప్రజాస్వరం) : 

Read More జవహర్ నగర్ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు కాంగ్రెస్ నాయకుల వినతి


 మండల పరిధిలోని పోసానిపల్లి గ్రామానికి చెందిన అబ్రమైన రాములు నవంబర్‌ 11న పోసానిపల్లి నుంచి దౌల్తాబాద్ పట్టణానికి వచ్చి పనులు ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో కోనయపల్లి గ్రామ సమీపంలో వెనుక నుంచి కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.స్థానికులు వెంటనే రాములును గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక కాలును తొలగించాల్సి వచ్చినట్టు వైద్యులు తెలిపారు.ఈ విషయాన్ని తెలుసుకున్న దౌల్తాబాద్ బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సయ్యద్ రహీముద్దీన్ మంగళవారం రాములు కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. రాములకు జరిగిన ప్రమాద వివరాలను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డికి తెలియజేశామని, బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గువ్వలేగి సర్పంచ్ అల్లిశేఖర్‌ రెడ్డి, గోవిందాపూర్ మాజీ సర్పంచ్ గుడిసె చంద్రమౌళి గౌడ్, అబ్రమైన కుమార్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Read More డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన  సీఈవో

Latest News

అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు
      రామయంపేట. 17.( ప్రజాస్వరం ) మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్ హోటళ్లు, రెస్టారెంట్ల పై,చర్యలు తీసుకుని, ఆహార భద్రత
హనుమాన్ గుడి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి 
బాధిత కుటుంబానికి అండగా అంజిరెడ్డి...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు
క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుదాం : : పట్నం మహేందర్ రెడ్డి 
రెండేళ్లుగా అభివృద్ధి లేదు : మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 
 ఏసీబీ వలలో ఓయూ డీ ఈ