జవహర్ నగర్ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు కాంగ్రెస్ నాయకుల వినతి
జవహర్ నగర్, డిసెంబర్ 16, ( ప్రజాస్వరం) :
జవహర్ నగర్ సర్కిల్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మంగళవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనూ చౌదరిని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. సుమారు200 కాలనీల్లో విస్తరించిన జవహర్ నగర్ లో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసం ఉంటున్నారు. గత 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు.అయితే పాత ఇండ్ల స్థానంలో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి లేదా పాత ఇంటి స్థానంలో పక్కా ఇంటి నిర్మాణం చేపట్టడానికి కూడా అనుమతులు మంజూరు చేయాడం లేదు.గత ప్రభుత్వాలు ఇచ్చిన 58,59 జీవో ద్వారా వచ్చిన పట్టాలు ఇప్పుడు నూతనంగా ఇండ్లు పట్టుకోవడానికి అనుమతులు ఇవ్వక పోవడంతో ఏం చేయాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదే విధంగా ఇంకా మిగిలిన ఖాళీ స్థలాల అంశం న్యాయస్థానంలో ఉండడంతో అక్కడ చేపట్టాల్సీన ఒపెన్ జిమ్,సమీకృత మార్కెట్ నిర్మాణం, క్రీడా ప్రాంగణం లాంటివి పెండింగ్‌లో ఉండడంతో పనులు జరగకపోవాడంతో ఖాళీ స్థలాలను కొందరు ప్రయివేటు వ్యక్తులు కబ్జా చేయాలని చూస్తున్నారని కావునా దానికి సంబంధించిన పరిష్కారం తక్షణమే చూపి భూములు కాపాడాలని కోరారు.ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్: జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేస్తున్న నాయకులు


