రెండేళ్లుగా అభివృద్ధి లేదు : మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 

ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేద్దామనుకున్నా

రెండేళ్లుగా అభివృద్ధి లేదు :  మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 



జవహర్ నగర్, డిసెంబర్ 16, ప్రజాస్వరం:

 

Read More రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు

మేడ్చల్ నియోజకవర్గంలో రెండేళ్లుగా అభివృద్ధి అనేది లేదని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరం మల్లారెడ్డి అన్నారు. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ పై చర్చ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అకౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మల్లారెడ్డి మాట్లాడుతూ... మేడ్చల్ నియోజకవర్గం లోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు జిహెచ్ఎంసి పరిధిలోని 150 డివిజన్ల చెత్తను తరలిస్తున్నారని కానీ అక్కడ ప్రజల జీవితాలను జిహెచ్ఎంసి అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోట్ల రూపాయలు వెచ్చించి డంపింగ్ యార్డ్ కు క్యాపింగు, మురుగునీటి శుద్ధీకరణ చేశామని స్థానికంగా ఉన్న బస్తీలకు రోడ్లు మంచినీటి సౌకర్యం కల్పించామని ప్రస్తుతం అక్కడ కాలుష్యం రాజ్యమేలుతుందన్నారు భూమి, నీరు, గాలి కాలుష్యంగా మారిందని ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్న ఇప్పటివరకు అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. జిహెచ్ఎంసిలో ఒకవైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కోట్ల రూపాయలకు ఎకరం భూమి బంగారు కొండను తలపిస్తుంటే అదే జిహెచ్ఎంసి పరిధిలోని జవహర్ నగర్ లో 150 డివిజన్ల చెత్తతో చెత్త కొండను నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రేటర్ లో విలీనం చేసిన జవహర్ నగర్ కు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి అభివృద్ధికి చేయాలన్నారు.

Read More బాధిత కుటుంబానికి అండగా అంజిరెడ్డి...

Latest News

అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు
      రామయంపేట. 17.( ప్రజాస్వరం ) మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్ హోటళ్లు, రెస్టారెంట్ల పై,చర్యలు తీసుకుని, ఆహార భద్రత
హనుమాన్ గుడి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి 
బాధిత కుటుంబానికి అండగా అంజిరెడ్డి...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు
క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుదాం : : పట్నం మహేందర్ రెడ్డి 
రెండేళ్లుగా అభివృద్ధి లేదు : మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 
 ఏసీబీ వలలో ఓయూ డీ ఈ