ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు

ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు

 

ప్రజాస్వరం, మనోహరాబాద్ : 


సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు మనోహరబాద్ మండలం కాళ్లకల్ బంగారమ్మ ఆలయం వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేసి సబురాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్,జిల్లా నాయకులు పురం మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రావడంలో హరీష్ రావు పాత్ర ప్రత్యేకం అన్నారు.నిరనతరం ప్రజల కోసం పోరాడే వ్యక్తి హరీష్ రావు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నాయకులు లక్మన్ సింగ్ ఠాకూర్,నాగభూషణం, రేణు కుమార్, సాదు సత్యనారాయణ, మహేందర్, రాహుల్ రెడ్డి, వెంకట్ యాదవ్ , మహేష్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.