తూప్రాన్ లో ఘనంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు  ......

తూప్రాన్ లో ఘనంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు  ......

ప్రజాస్వరం : తూప్రాన్ ,జూన్ 3  :

 

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లో సిద్ధిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన కార్యక్రమాన్ని తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ , ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు బుధవారం జన్మదిన వేడుకలుఘనంగా నిర్వహించారు హరీష్ రావు జన్మదినం పురస్కరించుకొని తూప్రాన్ లో ఏర్పాటుచేసిన వేడుకలకు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు ఎమ్మెల్సీయాదవ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని సబ్బండ వర్గాలతో ఉధృతం చేసిన ఘనత హరీష్ రావుదే అని తెలంగాణ సాధించిన తరవాత 9 ఏళ్ళు మంత్రి గా ఉండి కాళేశ్వరం. మిషన్ కాకతీయ చెరువుల అభివృద్ధి చేశాడని ఆయన అన్నారు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతు.. తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ తో పాటు కీలక పాత్ర పోషించిన హరీష్ రావు తెలంగాణ ఆవిర్భంలో తర్వాత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని హరీష్ రావు అనుకొనియాడారు మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజిని గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన డైనమిక్ యంగ్ లీడర్ డబుల్ షూటర్ హరీష్ రావు 54వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  హరీష్ రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొక్కొండ సమతా కాశిరెడ్డి పాలకవర్గ సభ్యులు జైపాల్ రాథోడ్ సత్య లింగం ,రాధాకుమారి ఐలేష్ యాదవ్, లక్ష్మి పార్టీ మండల అధ్యక్షులు బాబుల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, సత్తార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.