ప్రయివేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ పాఠశాల...  

ప్రయివేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ పాఠశాల...  

ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 20 : 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఎం.పీ.పీ.ఎస్. తూప్రాన్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరి తరగతి ప్రారంభించడం జరిగింది,అని ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్ తెలిపారు విద్యార్థులకు బోధించడానికి TTC చేసిన ఒక టీచర్ ను ఒక ఆయాను నియమించారు, టీచరుకు నెలకు 8000 ఆయాకు 6000 ప్రభుత్వం ఇస్తుంది, ఆంగ్లంలో బోధన చేయడం, వ్యక్తిగతంగా విద్యార్థుల పట్ల శుద్ధ తీసుకోవడం, క్రమశిక్షణతో కూడిన విద్య ను అందించడం, ఆట పాటలతో విద్యార్థులను ఆనంద పరచడం, విద్యార్థులకు బోధించడంతో పాటు ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వడం, పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా తూప్రాన్ ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన క్రమశిక్షణతో కూడిన విద్య, ప్రతిరోజు విద్యార్థి బడికి వచ్చేలా చూడడం , వ్యక్తిగత శ్రద్ధ,AI తో కూడిన కంప్యూటర్ శిక్షణ, అనుబవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన, ఆంగ్ల బోధన, ప్రతి తరగతి విద్యార్థులకు ఫర్నిచర్, ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు ప్రధానోపాధ్యాయుడు విద్యార్థి ఇంటికి వెళ్లి పర్యవేక్షణ చేయడం, ప్రతి విద్యార్థికి ఉచితంగా రెండు జతల యూనిఫాం బుక్స్ వర్క్ బుక్స్ నోట్ బుక్స్ భోజనం రాగి జావా ఇవ్వడం జరుగుతుంది.తూప్రా న్ గ్రామ ప్రజలకు తెలియజేయునది మా ప్రభుత్వ పాఠశాలకు మీ విద్యార్థులు పంపించండి, పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కాగలరని ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ కోరుచున్నారు.

Latest News

ప్రయివేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ పాఠశాల...   ప్రయివేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ పాఠశాల...  
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 20 :  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఎం.పీ.పీ.ఎస్. తూప్రాన్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరి తరగతి ప్రారంభించడం...
మెడికల్ షాప్ ల బంద్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రలలో అందుబాటులో మందులు...  
సీఎం,మంత్రుల పేర్లు చెప్పుకుంటూ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు ....
సబ్సిడీలో పచ్చి రొట్ట ఎరువులు అందుబాటులో ఉంటాయి...
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్ర ని సందర్శించిన అదనపు కలెక్టర్ నగేష్ ...
మంత్రి వివేకే ను కలిసిన మార్కెట్ కమిటీ. చైర్ పర్సన్ కీర్తన రెడ్డి... 
ఆన్‌లైన్ ఔషధ విక్రయాల కు నిరసనగామే 20న మెడికల్ షాప్ లు బంద్..