ఆన్‌లైన్ ఔషధ విక్రయాల కు నిరసనగామే 20న మెడికల్ షాప్ లు బంద్..
ప్రజాస్వరం : తూప్రాన్, మే 19
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ లో కేమిస్ట్ మరియు డ్రగ్స్ అసోసియేషన్ అధ్యక్షులు ర్యాకల కృష్ణ గౌడ్ మీడియా సమావేశం లో మాట్లాడుతు... అల్ ఇండియా అరనైజేషన్ఆఫ్ కేమిస్ట్ అండ్ డ్రగ్స్ దేశ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు ఆన్ లైన్ లో మందులు అమ్మడం వల్ల గ్రామాల లో ఉండే మెడికల్ షాప్ లు బంద్ అయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని మే 20 న దేశ వ్యాప్తంగా మెడికల్ షాప్ లు బంద్ పిలుపు కు మద్దతు గా మెడికల్ షాప్ లు బంధు నిర్వస్తున్నట్లు కృష్ణ గౌడ్ తెలిపారు అత్యవసర మందులు అవసరం ఉన్నవారు ముందుగానే కొనుకోవ్వాలని కోరారు మెదక్ జిల్లా వ్యాప్తంగా మెడికల్ బందుకు సహకరించాలని అన్నారు సమస్య ఏంటి ఆన్‌లైన్‌లో మందులు అమ్మడం వల్ల చిరు మెడికల్ షాపుల వ్యాపారాలు దెబ్బతింటోంది. ఈ-ఫార్మసీలు కేవలం లాభాలే చూసుకుని, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నాయని వ్యాపారుల ఆరోపణలు చేస్తున్నారు .వ్యాపారుల ఆందోళన సాధారణ వస్తువులు, ప్రాణరక్షక మందుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు సరఫరా చేస్తున్నారు యువత నిద్రమాత్రలు, ఇతర మత్తు పదార్థాలకు బానిసలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా చిరు వ్యాపారులమనుగడ ప్రశ్నార్థకం ఆరోపణలు మల్టీనేషనల్, బారీ డిస్కౌంట్ల పేరుతో బహుళ జాతి కంపెనీలు చిన్న షాపులను దెబ్బతీస్తున్నాయి అని వారు పేర్కొన్నారు చదువురాని పేద రోగులు ఆన్‌లైన్ ఆర్డర్ చేయలేక, స్థానిక కెమిస్టులు ఇచ్చే కౌన్సెలింగ్‌కు దూరం అవుతున్నారని నాణ్యత లేని, నకిలీ మందులు సరఫరా అవుతున్న సంఘటనలు ఉన్నాయని దీనికి నిరసనగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు మే 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్* జరగనుంది.ప్రిస్క్రిప్షన్ వెరిఫికేషన్ లేకుండా మందులు అమ్మే ఆన్‌లైన్ పద్ధతిని నియంత్రించాలిఅని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఈ-ఫార్మసీ విధానాన్ని ప్రోత్సహించడం మానుకోవాలి కోరారు ప్రజల ప్రాణాలు బలికాకుండా చూడటమే అసలు ఉద్దేశం అని వ్యాపారులు చెబుతున్నారు విద్య, వైద్యం లాభాపేక్ష లేని సేవలుగా కొనసాగాలని కోరుతున్నారు.ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల 12.4 లక్షల చిన్న మెడికల్ షాపులు మూతపడే ప్రమాదం ఉందని, నకిలీ మందులు, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం ప్రజారోగ్యానికి ముప్పు అని వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. దీనికి నిరసనగా మే 20న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు.తూప్రాన్‌లో కూడా మే 20న మెడికల్ షాపులు బంద్ అయ్యే అవకాశం ఉంది. అత్యవసర మందులు ముందే తీసుకోవాలని తెలిపారు.


