శ్రీ రామ నగర సంకీర్తనకు ఘన స్పందన
పాల్గొన్న ఈర్ల రాజు ముదిరాజ్
By Prajaswaram
On
అమీన్ పూర్, జనవరి 22(ప్రజాస్వరం):
అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠను స్మరించుకుంటూ బీరంగూడలో జనవరి 22న నిర్వహించిన శ్రీ రామ నగర సంకీర్తన భక్తిశ్రద్ధలతో జరిగింది. పటేల్ గూడా, బీరంగూడ పరిధిలోని హనుమాన్ దేవాలయాల ఆధ్వర్యంలో భక్తులు రామభజనలు ఆలపిస్తూ ఊరేగింపుగా ముందుకు సాగారు. వందనాపురి రామాలయం వద్ద పట్టు వస్త్రాల సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త ఈర్ల రాజు ముదిరాజ్ పాల్గొని భక్తులతో కలిసి రామస్మరణలో పాల్గొన్నారు. పని రోజు అయినప్పటికీ పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకావడం విశేషం.
Latest News
04 Feb 2026 06:56:36
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలిసులకు...


