రైతు భరోసా ఒకటే దశలో పంపిణీ చేయాలి....
బీఆర్ఎస్ నాయకులు...
By Prajaswaram
On
అర్హులైన రైతుల వివరాలు ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి....
ప్రజాస్వరం, మనోహరాబాద్ :
మనోహరాబాద్ మండల బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన విట్టల్ కు సీఎంఆర్ఎఫ్ చెక్కును బి ఆర్ ఎస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసే రైతు భరోసాను అర్హులైన రైతులందరికీ ఒకే దశలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. స్పెషల వారీగా పంపిణీ చేస్తూ రైతులకు నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు. మొదటి దశలో రెండు ఎకరాల విస్తీర్ణం గల రైతులకు మాత్రమే అందజేస్తున్నామని చెప్తూ సుమారు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయడం బాధాకరమన్నారు. ఎంత విస్తీర్ణం ఉన్న రైతులకు రైతు భరోసా కల్పిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులందరికీ ఒకటే దశలో రైతు భరోసా పంపిణీ చేయాలని కోరారు. ఇప్పటివరకు చెల్లించలేని మూడు సీజన్ ల రైతు భరోసాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్, జిల్లా ఉప సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు రేణు కుమార్, దండుపల్లి మాజీ ఉపసర్పంచ్ మహేందర్ గౌడ్, మనోహరాబాద్ పట్టణ బి ఆర్ ఎస్ మాజీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, నాయకులు దుర్గేష్ యాదవ్, వెంకటేష్ గౌడ్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
30 Jun 2026 21:49:40
ప్రజాస్వరం, తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. తూప్రాన్...


