పాండురంగ విఠలేశ్వర స్వామి వార్షికోత్సవం....

పాండురంగ విఠలేశ్వర స్వామి వార్షికోత్సవం....

మాసాయిపేట, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం):

 

మండల కేంద్రంలోని పురాతన శ్రీ పాండురంగ విశ్వేశ్వర దేవాలయ 22వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వేద పండితులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, అఖండ దీపారాధన, కలశ స్థాపన, మండపారాధన జరగనున్నాయి. అనంతరం శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం, భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Latest News