డా,, జిల్లా శ్రీనివాస్ కు ప్రతిష్ఠాత్మక ‘ఐఈఏ' హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డు...

నటి జయప్రద చేతుల మీదుగా పురస్కారం....

డా,, జిల్లా శ్రీనివాస్ కు ప్రతిష్ఠాత్మక ‘ఐఈఏ' హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డు...

నాణ్యమైన వైద్య సేవలకు దక్కిన గుర్తింపు.....

 

ప్రజాస్వరం : మేడ్చల్  : జూన్ 28 :

 

చిన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు, పెద్ద వారిలో న్యూరాలజికల్ సమస్యలతో బాధ పడుతున్న వారికి ఫిజియోథెరపిస్ట్ గా ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తు,వైద్య సేవల్లో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్న డా,,జిల్లా శ్రీనివాస్ కు ప్రతిష్టాత్మకమైన ఐ ఈ ఏ హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డు కైవసం చేసుకున్నారు.హెల్త్ కేర్ రంగంలో రోగులకు అందించిన ఉత్తమ, నాణ్యమైన సేవలకు గుర్తింపుగా డా,,జిల్లా శ్రీనివాస్ కు ఈ అవార్డు వరించింది. నగరంలో వైభవంగా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి, మాజీ రాజ్యసభ సభ్యురాలు జయప్రద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డా,,జిల్లా శ్రీనివాస్ కు ఆమె చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందజేశారు.