జవహర్ నగర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన
జవహర్ నగర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన
అంబేద్కర్ నగర్ చెరువు, పలు నిర్మాణాలను పరిశీలన
జవహర్ నగర్ :
హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ద్వారం పర్యటించారు.రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి అంబేద్కర్ నగర్ ఇందిరమ్మ చెరువులోనిఎఫ్ టి ఎల్,బఫర్ జోన్ లో పరి నిర్మాణాలను పరిశీలించి అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి చెరువులు స్థలాన్ని ప్లాట్లుగా అమ్మిన వారిపై క్రిమినల్ కేసులో నమోదు చేస్తామన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ రాంకీ యజమాన్యం అక్రమంగా డంపింగ్ యార్డ్ నీటిని కిందికి వదలడం వల్ల హరిదాసు పల్లి గ్రామంలోని పలు చెరువులు, కుంటలు కలుషితమవుతున్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో స్వయంగా ఆ ప్రాంతాలను పరిశీలించారు.జవహర్ నగర్ లో అనంతరం సర్వేనెంబర్ 476, 501 లో చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు పలు ఫిర్యాదులు అందడంతో ఈ నిర్మాణాలను పరిశీలించినట్లు తెలిపారు. నిర్మాణాలపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశించారు.మరో రెండు మూడు రోజుల్లో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.వ్యక్తిగత కక్షలతో ఫిర్యాదులు చేపడితే ఆ విషయంగా కూడా విచారణ జరిపి పార్టీలకతీతంగాచర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కాప్రా ఎమ్మార్వో సుచరిత, జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ రెడ్డి, దమ్మైగూడ మున్సిపల్ కమిషనర్ నాగమణి డిపిఓ శ్రీదేవి, దమ్మైగూడ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
హైడ్రా కమిషనర్ పర్యటనతో భూకబ్జాదారుల్లో దడ: ......
హైడ్రా కమిషనర్ రంగనాథ్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూకబ్జాదారులో దడ మొదలైంది ఇప్పటివరకు మూడు పూవులు వారి కాయలు కాసాగిన వారి వ్యాపారం ఇక ముందుకు సాగదని తేలిపోయింది. మరోవైపు హైడ్రా అధికారులు ఎప్పటిలాగేనే పేదలపై తమ ప్రతాపం చూపించి పెద్దలకు వత్తాసు పలుకుతారా లేదంటే ముందు పెద్దలకు సంబంధించిన బహుళ అంతస్తుల నిర్మాణాలలు, ఫామ్ హౌస్ లు అక్రమంగా ఆక్రమించుకున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన తర్వాతే పేదల నిర్మాణాలు కూల్చివేస్తారా వేచి చూడాలి!