సికింద్లపూర్ ఆలయానికి విద్యాసాగర్ 5 వేలు అందజేత

సికింద్లపూర్ ఆలయానికి విద్యాసాగర్ 5 వేలు అందజేత

 

 మనోహరాబాద్ / శివంపేట ( ప్రజాస్వరం ) :

Read More వేంకటేశ్వర స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

 మెదక్ జిల్లా శివంపేట మండలం లోని  సికింద్లపూర్ శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన సోషల్ వర్కర్ నేతి కుంట భవాని విద్యాసాగర్ రూ. 5 వేలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రతి నూతన సంవత్సరం రోజున ఆలయానికి 5000 రూపాయలు అందజేయడం జరుగుతుందని అందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకుంటే ఎన్నో పుణ్యాలు లభిస్తున్నట్లు నమ్ముతున్నానని తెలిపారు. రానున్న కాలంలో ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అందుకు స్వామివారు తనకు అవకాశం కల్పించాలని భగవంతున్ని కోరుతున్నట్లు విద్యాసాగర్ తెలిపారు.

Read More రోడ్డుపై బైఠాయించిన రైతులు..