పోలీస్ అనుమతుల తో ఊరేగింపు చేయాలి...
సిఐ రంగా కృష్ణ....
By Prajaswaram
On
తూప్రాన్, జనవరి 29.(ప్రజాస్వరం):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ పరిధిలో నిర్వహించే ర్యాలీలు, ఊరేగింపులు మరియు డీజే సౌండ్‌ల వినియోగానికి ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సీఐ రంగ కృష్ణ తెలిపారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించినా, డీజే సౌండ్‌లతో ఊరేగింపుగా వెళ్లినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు.కావున ర్యాలీలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించదలచిన వారు ముందుగానే మున్సిపల్ కార్యాలయం మరియు సంబంధిత పోలీస్ శాఖను సంప్రదించి అనుమతులు పొందాలని తూప్రాన్ సిఐ రంగా కృష్ణ సూచించారు.
Latest News
12 Feb 2026 21:42:29
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...


