ఘనంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

గజమాలతో స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు

ఘనంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

 నార్సింగి, ఏప్రిల్ 19 (ప్రజా స్వరం) : కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి 54వ జన్మ దిన వేడుకలు నార్సింగి మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డికి గజమాలతో, శాలువాలతో ఘనంగా సన్మానిస్తూ స్వాగతం పలికి స్థానిక మీర్జాపల్లి చౌరస్తా నుంచి స్టేట్ బ్యాంక్ వరకు ర్యాలీగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల మధ్య కేకును కోసి శ్రీనివాస్ రెడ్డి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా టీపీసీసీ సేవా దళ్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, నాయకులు సంపత్ రెడ్డి లు మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల తరపున జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడని కొనియాడుతూ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని, ఆయన తండ్రి స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి లాగా పెద్ద పెద్ద పదవులను అందుకోవాలని, ఆయుర్ ఆరోగ్యాలతో వర్థిల్లుతూ చిరకాలం ఉండిపోవాలని వారు ఆకాంక్షించారు. అంతకు ముందు మండల పరిధిలోని వల్లూరు వద్ద కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు వినోద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More కేసీఆర్ ప్రసంగంలో పస లేదు

మొత్తం మీద నియోజకవర్గ ఇన్చార్జి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులలో కొత్త జోష్ ను నింపింది. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ జూకంటి రాజా గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ యెన్నం రాజేందర్ రెడ్డి,  గోవర్ధన్, రాజేష్, కేశవులు, శ్రీధర్ రెడ్డి, బాచి స్వామి, బాలరాజు గౌడ్, రాజా గౌడ్, సుధాకర్, రుక్ముద్దీన్, ప్రభాకర్, లక్ష్మి నరసింహులు, ఆటో జానీ, యేమికే రాజు, జహీర్, మోతి లాల్, స్వామి, బాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read More మే డే స్ఫూర్తితో ఉపాధి హక్కులను కాపాడుదాం