మే డే స్ఫూర్తితో ఉపాధి హక్కులను కాపాడుదాం

ఏఐవైఫ్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. రాజు

మే డే స్ఫూర్తితో ఉపాధి హక్కులను కాపాడుదాం

కోసిగి :
అంతర్జాతీయ శ్రామిక దినం మేడే సందర్భంగా ఉపాధి కూలీల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమాని ఉద్దేశించి ఏఐవైఎఫ్ జిల్లా సహాయక కార్యదర్శి ఎం. రాజు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్ మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది గంటల పని విధానం కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకున్నారని, ఈ సందర్భంగా ఆనాటి పోలీసులు కార్మికులపై కాల్పులు జరపడం ఆ కాల్పుల్లో 8 మంది కార్మికులు అమరులయ్యారని, కార్మిక ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులకు ఉరిశిక్షల విధించారని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా యాజమాన్యాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం తిరుగుబాటు జెండాను ఎగరవేసింది. దీంతో దిగివచ్చిన యాజమాన్యం ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇది కార్మికులు సాధించిన విజయం అని వారు తెలిపారు. ఈ మహత్తరమైన పోరాటంలో రక్తంతో తడిసిన జెండానే ఎర్రజెండాగా ఇవాళ ప్రజల ముందు నిలిచిందని వారు అన్నారు. నేడు ఉపాధి హామీ పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని, గ్రామాలలో వలసలు ఆపుతామని చెబుతున్న పాలకులు ఆ వైపు  చొరవ చూపటం లేదని అన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను విడుదల చేయాలని, ఉపాధి హామీ పథకాలకు కూలీలకు  సరైన వసతులు కల్పించి వారికి పనులకు అవసరమైన సామాగ్రిని ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉపాధి హామీ పథకం కూలీలంతా కలసి ప్రభుత్వ కార్యాలయల ముందు ధర్నాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు విద్యార్ధి, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.