కేసీఆర్ ప్రసంగంలో పస లేదు
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ప్రజాస్వరం) :
కేసీఆర్ స్పీచ్‌లో అసలు పసలేదని, తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల వల్ల ఉన్న కడుపుమంటే కేసీఆర్ కు కనిపిస్తోందంటూ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో భాగంగా కేసీఆర్ ఇచ్చిన ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బస్సులు ఆపితే సభ ఆగిపోతుంది అని అనుకునెటువంటి ఆలోచన వాళ్ళకుంటదని అన్నారు. గతం లో ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ కు వాళ్ళు కనీసం బస్సులు కూడా ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా కర్రెగుట్ట ఆపరేషన్ ఆపాలని, శాంతి చర్చలకు తాము సిద్ధ మంటూ మావోలు పంపిన లేఖపై కూడా స్పందించారు.
ఈ శాంతి చర్చల విషయం పై పార్టీ హైకమాండ్‌కు సమాచారం ఇస్తామని, ఆ తర్వాత ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకో వాలో డిసైడ్ అవుతామని చెప్పారు.శాంతి చర్చల అంశం పై పార్టీ హైకమాండ్ కి కూడా సమాచారం ఇస్తాం. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం .... అధిష్టానం కి పీస్ కమిటీ రిక్వెస్ట్ నీ పంపిస్తాం. ఆ వ్యవహారం అంతా జానారెడ్డి.. కేకే చూస్తారరన్నారు. నేను సీఎం అయిన రెండో రోజే కేసీఆర్ కు గుండె పగిలినట్లయిందని అన్నారు. ఇప్పుడు రాష్ట్రం లో జరుగుతున్న అనర్ధాల కు కేసీఆర్ కారణం. ఖజానా అంతా లూటీ చేసింది ఆయన కాదా, కేసీఆర్ స్పీచ్ అంతా అక్కసు తో మాట్లాడినట్టు ఉందన్నారు. కేసీఆర్ సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని ఇచ్చామన్నారు. ఆర్‌టీసీకి ఆదాయం కూడా వచ్చింది.
ఆదివారం కేసీఆర్ తన అక్కసు మొత్తం కక్కాడు. కేటీఆర్, హరీష్ లను పిల్లగాల్లు అని కేసీఆర్ అన్నాడు.మరి ఆ పిల్లగాళ్ళను అసెంబ్లీ కి ఎందుకు పంపిస్తున్నాడు. కేసీఆర్ స్పీచ్ లో పస లేదు సంవత్సరన్నరగా పథకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు వాటన్నిటిని స్ర్టీమ్ లైన్ చేస్తున్నాం. ప్రపంచంలో ఇంధిరా గాంధీ కి మించిన యోధురాలు లేదు. ఓక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరా గాంధీదే.కేసీఆర్, మోడీ, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారు. నాకు రాహుల్ గాంధీ మధ్య మంచి రిలేషన్ ఉంది. ఇది ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు అని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీం లు ఏ రాష్ట్రంలో అమలు లో లేవు, చివరి 6 నెలలు వీటి పై చర్చ జరుగుతుంది. కగార్ అంశం పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కగార్ పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తాం.పదేళ్లు మాకు కూడా అవకాశం ఇస్తారు ప్రజలు. పదేళ్లలో ఆయన చేసిన విధ్వంసం సెట్ చేయడానికే ఏడాది సరిపోయింది. కేటీఆర్, హరీష్ లు చిన్న పిల్లలు అసెంబ్లీకి వస్తున్నారు అని నేను ముందే చెప్పాను కేసీఆర్ కూడా ఆదివారం రజతోత్సవ సభలో అదే చెప్పారు.