ఫైరింగ్ రేంజ్ శిక్షణ పనులను పరిశీలించిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
నార్సింగి, మే 1 (ప్రజా స్వరం) : మెదక్ జిల్లా నార్సింగి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ ప్రారంభోత్సవం మే 2వ తేది శుక్రవారం ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది. ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి, తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ రంగనాయక, పోలీస్ సిబ్బంది తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నార్సింగి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న ఫైరింగ్ రేంజ్ పనులు పూర్తి అయ్యాయని, ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవానికి సిద్దం అవుతుందని అన్నారు. గతంలో ఫైరింగ్ ప్రాక్టీస్ కొరకు వేరే జిల్లా లోని ఫైరింగ్ రేంజ్ కు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు మెదక్ జిల్లా పోలీస్ సిబ్బందికి ఇక్కడి ఫైరింగ్ రేంజ్ కల సాకారం కాబోతుంది అని అన్నారు. మే 2న ఐజి చేతుల మీదగా ప్రారంభోత్సవానికి సిద్దం అవుతుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, స్థానిక ఎస్సై అహ్మద్ మోహిఉద్దీన్, చెగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, ఆర్ఐ శైలెందర్ వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.