పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలి

జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్.. జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రాధా కిషన్ 

పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలి

తూప్రాన్, మే 1,ప్రజాస్వరం : విద్యార్థులు చిన్నతనం నుంచే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో చదివి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాధా కిషన్ లు  అన్నారు. ఈ సందర్భంగా నిన్న వెలువడిన టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో స్టేట్ లెవెల్ లో ర్యాంకు సాధించిన శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిని కొక్కొండ శ్రీనిధిని మెదక్ వారి ఆఫీసులలో అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే చదువుపై దృష్టి సారించి మంచి మార్కులు సాధించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. విద్యార్థులు చదువులో చురుకుగా ఉండేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ ఏజీఎం రమణారావు,  జోనల్ కోఆర్డినేటర్ రవి, తూప్రాన్ బ్రాంచ్ ప్రిన్సిపల్ రామకృష్ణ, డీన్ అశోక్ తదితరులున్నారు.WhatsApp Image 2025-05-01 at 4.54.27 PM (1)